రేపు ఉదయం సిద్దిపేటలో విద్యుత్ అంతరాయం..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట
రేపు ఉదయం 8-30 నుండి 12-30 వరకు సిద్దిపేట లోని పలు ప్రాంతాలలో విద్యుత్తు అంతరాయం ఉంటుందని సిద్దిపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట లోని హనుమాన్ నగర్, వేములవాడ కమాన్, ఆర్టీఎ కార్యాలయం, లింగారెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతం, సీసీ గార్డెన్ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఇందుకు కారణం11 కేవీ కరీంనగర్ ఇండస్ట్రియల్ ఫీడర్‌లో చెట్ల నరికివేత కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. దయచేసి వినియోగదారులు సహకరించాలని కోరారు.