పట్టభద్రుల కోసం పదవి త్యాగం
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా
పెద్దల సభకు వన్నె తెస్తా
పట్టభద్రులు మార్పుకు నాంది కావాలి
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్
సిద్దిపేట టైమ్స్ డెస్క్ :

ప్రముఖ విద్యావేత్త, నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు మంచి పౌరులుగా తీర్చిదిద్దిన అధ్యాపకుడు, విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత, సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రసన్న హరికృష్ణ ప్రస్తుతం గజ్వేల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా పనిచేస్తూ తన 19 సంవత్సరాల ఉద్యోగ వ్యవధి ఉన్నప్పటికీ కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్ పట్టభద్రుల MLC గా పోటీ చేసి నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయాలనే ఒక లక్ష్యంతో సాహసోపేత నిర్ణయం తీసుకొని సోమవారం ఉదయం తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ…. దాదాపు రెండు దశాబ్దాల తన ఉద్యోగ ప్రస్థానం లో విద్యార్థుల భవితకు తన వంతు కృషి చేయడం జరిగిందని త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో తన పదవికి రాజీనామా చేయడం జరిగిందని అన్నారు. శాసన మండలి నేడు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, దిశ, దశ నిర్దేశించాల్సిన పెద్దల సభ కొన్నేళ్లుగా గాడి తప్పిందని పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వ దించి మండలికి పంపిస్తే పెద్దల సభకు వన్నెతెస్తానని ప్రసన్న హరికృష్ణ అన్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి తన 19 ఏళ్ల సర్వీసును వదులుకున్నానని తెలిపారు. పెద్దల సభలో మేధావి వర్గం ఉండాల్సిన అవసరం ఉందని, పట్టభద్రులంతా అలోచించి తనను ఆశీర్వ దించాలని కోరారు. పట్టభద్రుల సమస్యలే లక్ష్యం గా పనిచేస్తానని అన్నారు. మంచి మార్పు కోసం, తనలాంటి వారిని శాసన మండలికి పంపేందుకు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సాయంత్రం పద్మనాయక కల్యాణ మండపంలో జరిగే ఆత్మీయ సమ్మేళనానికి హజరై చేయూతనివ్వాలని కోరారు. ఇప్పటికే ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి దఫా పర్యటన పూర్తి చేసుకు విద్యవేత్తలను, మేధావులను, పట్టభద్రులను, నిరుద్యోగులను, ఉద్యోగులను వివిధ సంఘాల నేతలను కలిశానని ఇక నుంచి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి గాను తన ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రులు రాబోయే ఎన్నికల్లో నాకు ఓటు వేసి అండగా నిలవాలని కోరారు.
