సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు..
పేకాట జోరుగా కొనసాగుతుందని నిర్ధారణ..?
పోలీసుల అదుపులో క్లబ్…
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, అక్టోబర్ 27
సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ పై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. సిద్దిపేట పట్టణం గాంధీ చౌరస్తాలో గల సిటిజెన్స్ క్లబ్ లో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ దాడులలో.. క్లబ్ పరిధి లో పేకాట జోరుగా కొనసాగుతుందని నమ్మదగ్గ సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ సూచన మేరకు పోలీస్ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.. రిక్రిషన్ పేరిట క్లబ్ లో ఇల్లీగల్ గా పేకాట కొనసాగుతున్నట్లు నిర్ధారించి.. ఈ మేరకుతనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. సుమారు సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ దాడులు కొనసాగాయి. ఈ తనిఖీల్లో ప్రముఖ రాజకీయ నేతలు తో పాటు పలువు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. దాడులలో క్లబ్ లో పేకాట ఆడుతున్న పలువురి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిని విచారించినట్లు సమాచారం. ఎట్టకేలకు క్లబ్ లో పేకాట డబ్బులు కాయిన్స్ రూపంలో మార్చి జూదం ఆడుతున్నట్లు పోలీస్ లు నిర్ధారించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు పోలీసులు దృవీకరించినట్లు తెలుస్తుంది. డబ్బులు చేతులు మర్చి పేకాట ఆడుతున్నట్లు నిర్ధారణ చేశారు. ఈ తనిఖీల్లో పలువురు కాంగ్రెస్ బడా నాయకులతో పాటు టిఆర్ఎస్ నాయకులు, సిద్దిపేట ప్రముఖులు సైతం అదుపులోకి తీసుకొని వారి సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా సిద్దిపేట నడిబొడ్డున క్లబ్ లో పేకాట బహిరంగగా కొనసాగుతుందని.. ఈ క్లబ్ నిర్వహణకు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు బూకాయిస్తున్నారని.. క్లబ్ కార్యకలాపాలపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి సమాచారం త్వరలో తెలియనుంది.









