Telangana Police: మందుబాబులకు పోలీసులు బిగ్ అలర్ట్!… బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చట్టరీత్యా నేరం.. ఈ నేరానికి ఆరు నెలలు వరకు జైలు శిక్ష
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
మందుబాబులకు పోలీసులు బిగ్ అలర్ట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నికలని, కౌంటింగ్ అని రకరకాల కారణాలతో ఆయా రోజుల్లో మద్యం దుకాణాలు బంద్ చేయగా. మరోపక్కా తెరిచి ఉన్న రోజుల్లో కూడా కావాల్సిన బ్రాండ్ల బీర్లు దొరక్కా మందుబాబులు ఇబ్బందులు పడుతుంటే..ఇప్పుడు మరో హెచ్చరిక చేశారు.పోలీసులు చల్లని సాయంత్రం అలా చెరువు కట్టకో,లేదా నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్లి చల్లగా ఓ బీరేద్దామనో.. దోస్తులతో కలిసి రెండు పెగ్గులో వేయాలని ప్లాన్ చేస్తే మాత్రం..ఆరు నెలల జైలు తప్పదంటున్నారు పోలీసులు.ఇంట్లోనో లేదా బార్‌లోనో కూర్చుని మాత్రమే మద్యం సేవించాలని..అలాకాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పోలీసుల కంట పడ్డారో ఇక అంతే సంగతి. మీకు ఆరు నెలల జైలుశిక్ష తప్పదు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నేరమంటూ హెచ్చరిస్తూ పోలీసు శాఖ (Telangana Police) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
“బహిరంగ మద్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజలకు,స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది.ఇలా రోడ్లపై కానీ,
ఖాళీ ప్రవేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.ఈ నేరానికి 6 నెలల వరకు జైలు శిక్ష