కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్..
సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్:

బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. శాసనసభ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రేస్ లో చేరేందుకు సిద్దం అయ్యారు.. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వేల్లారు. పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు భేటీ అయ్యారు. ఈ భేటీ లో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించనున్నట్లు ప్రకటించారు. త్వరలో జరిగే క్యాబినెట్ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ – బంజారాహిల్స్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేప్పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.