హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!…
ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా… కమిషనర్ మల్లికార్జున్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో ఫంక్షన్ హాల్ యజమానులు, శుభకార్య నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం జరుగుతోందని, అందువల్ల పట్టణంలోని అన్ని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం నిషేధించాల్సిన అవసరం ఉందని అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకుల నుండి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు వాడుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులు వాడినట్లు గుర్తిస్తే సంబంధిత ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు రూ.10,000 జరిమానా విధించడం లేదా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2016, మున్సిపల్ చట్టం–2019, పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుస్నాబాద్‌ను ప్లాస్టిక్ ఫ్రీ టౌన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు క్యాస రామ్, లక్ష్మారెడ్డి, బి.రాజయ్య, దేవేందర్ రెడ్డి, బత్తిని మహేందర్, కనకయ్య, క్రిస్టయ్య, సమత (TLFRP), జవాన్లు సారయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Posted inహుస్నాబాద్
హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..





