సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మచ్చ లాంటిదని, తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లెం వెయ్యాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. ఫోన్ టాపింగ్ తో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ప్రజా దర్బార్ నిర్వహించి, ఉద్యమ నినాదాలను అమలు చేయాలని కోరారు.