ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా పెరుమాండ్ల నర్సాగౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ డైరెక్టర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల నర్సాగౌడ్ ఎన్నికయ్యారు. వారం రోజున హుస్నాబాద్ పట్టణంలో నెల రోజుల పాటు ఘనంగా జరగనున్న శ్రీరేణుక ఎల్లమ్మ జాతర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నూతన ఉత్సవ కమిటీ నియామకం జరిగింది.ఈ సందర్భంగా డైరెక్టర్ గా ఎన్నికైన పెరుమాండ్ల నర్సాగౌడ్ మాట్లాడుతూ…. శ్రీ రేణుకఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ లోస్థానం కల్పించి అమ్మ వారికి సేవ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ నియామకానికి సహకరించిన సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ,రవీందర్, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, పున్న లావణ్య సది, భూక్యా సరోజన,మ్యాదర వేణి శ్రీనివాస్, కోమటి స్వర్ణలత సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, మహిళా సీనియర్ కాంగ్రెస్, మహిళ యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యు ఐ నాయకులకు ,ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.