పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యం
అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సందర్శన లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ రూరల్:
వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో, సీజనల్ వ్యాధుల పైన ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శనలో తెలిపారు. సందర్శనలో భాగంగా ముందుగా, వార్డులో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారి యొక్క ఆరోగ్య క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు, అనంతరం, ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మరియు రికార్డులను పరిశీలించారు, ఫార్మసీ స్టోర్ కి వెళ్లి మందుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. వర్షాకాలంలో వచ్చే అంటూ వ్యాధులను(కలుషితమైననీరు త్రాగడం వల్ల వచ్చే డయేరియా, రక్త విరోచనాలు, కామెర్లు,(gastroenteritis) దోమల కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, చికున్ గన్యా , ఫైలేరియా, డెంగ్యూను ఎదుర్కొనేందుకు, ముందస్తు చర్యలు మందులను సిద్ధంగా ఉంచుకోవాలని, ల్యాబ్ లో సేకరించిన పరీక్షల నమూనాలను T -Hub హబ్బుకు పంపించాలని, వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి ఆన్లైన్ ఎంట్రీస్ ని ఎప్పటికప్పుడు HIMS పోర్టల్ లో నమోదు చేయాలని, రానున్న వర్షాకాలంలో ప్రభలే అంటూ వ్యాధుల పైన ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. IP/OP కేసుల సంఖ్య పెంచాలని, గర్భిణీ స్త్రీల నమోదు, ప్రసవాల సంఖ్య పెంచాలని ప్రసవ అనంతరం తల్లి బిడ్డల సంక్షేమ చర్యలను చేపట్టాలని తెలిపారు. మానసిక రుగ్మతలకు సంబంధించిన సమస్యలను పై అవగాహన కల్పించేందుకు టెలి మానస్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. వారి వెంట డిప్యూటీ DMHO డాక్టర్ శ్రీనివాస్ వైద్యాధికారులు డాక్టర్ రమ్య, MLHP డాక్టర్ వినీత, CHO లు శబ్ద ప్రకాష్, జమీరుద్దీన్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

