సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
అత్యవసర సమయంలో 1930 నెంబర్ కాల్ చేయండి..
-ఎస్సై వి.గంగరాజు.
సిద్దిపేట టైమ్స్, దుబ్బాక ప్రతినిధి;
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎస్సై వి.గంగరాజు స్పష్టం చేశారు. దుబ్బాక పోలీస్ పరిధిలో లో సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువతకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపాలిటీ పట్టణంలోని శివాజీ విగ్రహాం వద్ష బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గంగరాజు మాట్లాడుతూ…. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేటి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచిత వ్యక్తులకు తెలపవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, కేవైసీలను అప్‌డేట్ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నెంబర్ కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు చూపే అత్యాశకు ఆశపడి ఎంతోమంది లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారని చెప్పారు. అత్యాశకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సామదని,కానిస్టేబుల్ ఆఫ్రోస్ తదితరులు ఉన్నారు.