పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ అధికారులను కోరారు.
సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు పెండింగులో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా జనార్ధన్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో సుమారు 7 వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగులో ఉన్నాయని,అవి విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చాలా ఆలస్యంగా నిధులు విడుదల చేసేదని తద్వారా కొన్ని చిన్న చిన్న కళాశాలలు మూతపడ్డాయని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. ఈ సంవత్సరం కూడా గత ప్రభుత్వం లాగానే నిధులు విడుదల చేయకుంటే ఇంకా ఇబ్బంది అవుతుందని విద్యార్ధులు చదివిన కళాశాలలో తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీనిద్వారా ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్, జిల్లా నాయకులు జక్కుల అనిరుధ్, షేక్ యాసిన్, సిద్ధుల సుమన్, హేమంత్ లు ఉన్నారు.
Posted inసిద్దిపేట
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలి
