పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం..
నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం..
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
సిద్దిపేట్ టైమ్స్, రామయంపేట ప్రతినిధి;


పేదోడి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ అభియాన్ ర్యాలీ చేపట్టారు. రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడ్డ పల్లె దవఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలల వ్యవధిలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి సేవాసంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో పురుగులు పట్టిన బియ్యాన్ని ప్రజలకు అందించారన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యాన్ని అందించాలనే కృచనిత్యంతో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని ఇంట్లో ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, నిజాంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుతి, నిజాంపేట మండలం పట్టణ అధ్యక్షుడునసీరుద్దీన్, కాంగ్రెస్ నాయకులు పంజా మహేందర్, వెంకట్ గౌడ్, నార్లాపూర్ తాజా మాజీ సర్పంచ్ అమర సేనా రెడ్డి, ప్రగతి ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ హరిప్రియ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.