రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట, శాంతి భద్రతలు ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి
నేరస్తులపై కఠినంగా వ్యవహరించడం, బాధితులకు అండగా నిలవడం ఫ్రెండ్లీ పోలీసింగ్
నూతనంగా నిర్మించిన ఏసిపి కార్యాలయం ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
మంగళవారం రోజు హుస్నాబాద్ పట్టణంలో అద్భుతంగా ఆధునిక టెక్నాలజీ తో నూతనంగా నిర్మించిన హుస్నాబాద్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎం రమేష్, ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి పోలీసులు ఎల్లవేళలా ఉండి సేవలు అందించాలని సూచించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేరస్తులపై కఠినంగా విచారించాలి బాధితులకు అండగా నిలవాలని సూచించారు. బాధితులు ఏదైనా సమస్య గురించి పోలీస్ స్టేషన్కు వస్తే హక్కున చేర్చుకుని సామరస్యంగా సమస్యలు పరిష్కరించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ఏసీపీ కార్యాలయం అద్భుతంగా నిర్మించడం జరిగిందన్నారు. రాబోవు రోజులలో పోలీసులు నూతన టెక్నాలజీ ఉపయోగించి విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి త్వరగా జరుగుతుందని. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారులు సిబ్బంది శాంతి భద్రతల గురించి అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. హుస్నాబాద్ ఎసిపి కార్యాలయాన్ని 2714 ఎస్ఎఫ్టి గ్రౌండ్ ఫ్లోర్ ఎసిపి కార్యాలయం, 2714 ఎస్ఎఫ్టి ఫస్ట్ ఫ్లోర్ ఎసిపి రెసిడెన్స్ మొత్తం ₹ 2.84 కోట్లతో నిర్మించడం జరిగిందన్నారు. మరియు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏసీబీ కార్యాలయాన్ని, మొదటి అంతస్తులో ఏసీపీ బస చేయడానికి అన్ని వసతులతో కలిపి రెసిడెంట్స్ నిర్మించడం జరిగిందని తెలిపారు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐపీఎస్ ఎం రమేష్ మాట్లాడుతూ… నూతనంగా నిర్మించిన ఏసీపీ కార్యాలయాన్ని మంత్రి చే ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు ఈరోజు నుండి ఈ కార్యాలయం నుండి ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్న నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ మధు, గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్, హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, చేర్యాల సీఐ శ్రీను, హుస్నాబాద్ డివిజన్ ఎస్ఐలు, స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
