కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవాలని వేడుకుంటూ శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి పాల అభిషేకం…!!!
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పోట్లపల్లి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి దేశంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం, కరీంనగర్ లో ఎంపీగా బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపోందాలని వేడుకుంటూ సంజయన్న అభిమానుల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పాలాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ మాజీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, అక్కన్నపేట మండల మాజీ అధ్యక్షుడు గోళ్లపల్లి వీరాచారి, మండల ప్రధాన కార్యదర్శి మడక రవి, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, కార్యదర్శులు భానోతు అనిల్ నాయక్,బసిరెడ్డి రాకేష్ రెడ్డి, మేకల బాబురావు,బీజేవైయం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకరాచారీ, బీజేవైయం హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఎస్టీ మోర్చా అక్కన్నపేట మండల అధ్యక్షుడు లావుడ్య రైనా నాయక్, బీజేవైయం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోజు సాయికృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు బోల్లి శ్రీనివాస్, వెల్దండి సంతోష్, కండే శంకర్, బూత్ అధ్యక్షులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పేరాల చంద్ర శేఖర్, జన్నారపు కళ్యాణ్ విష్ణు, పోలోజు రవికుమార్, సుమన్ నాయక్, మాజీ బూత్ అధ్యక్షులు బత్తిని జీవన్ కుమార్, మడక అర్జున్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


