అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి

అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించాలి

పట్టణ బిజెపి ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి పత్రం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయు లను బహిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మరియు మండల పార్టీ అధ్యక్షులు భూక్య సంపత్ నాయక్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు హుస్నాబాద్ తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…

పాకిస్తాన్ మద్దతుతో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులు గత నెల 22న కాశ్మీర్లోని పహేల్గo పర్యాటక ప్రాంతం లో పర్యాటకులుగా వెళ్లిన హిందువులను దాదాపు 26 మంది అమాయక పౌరులను బలిగొన్న దారుణ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఐఎస్ఐ పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మరియు అక్కడి సైన్యం ఆదేశాల మేరకు ఈ క్రూరమైన దాడి ప్రణాళిక బద్ధంగా జరిగిందని సమాచారం ఉందన్నారు. ఈ హేయమైన చర్యతో దేశ ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుందన్నారు. అంతేకాదు ఈ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా అనేక దేశాలు మనదేశానికి మద్దతుగా నిలుస్తున్నాయన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై మునుపెన్నడూ లేని విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంకల్పించారు ఈ చర్యల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే సంస్థలు లేదా దేశాలు తప్పించుకోలేవని స్పష్టం చేశారు ఈ సంకల్పాలు నెరవేర్చేందుకు ప్రధానమంత్రి భారత రక్షణ దళాలకు స్వేచ్ఛనిచ్చారు భారతరక్షణ ప్రతిష్టాత్మక కృషి ఈ చర్యను విజయవంతంగా సాధించడంలో కీలకంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం అని, ఈ విషయంలో 140 కోట్ల భారతీయులు ప్రధానమంత్రి మరియు రక్షణ దళాలకు అండగా ఉన్నారని,  ఏప్రిల్ 25 నాటి భారత హోం మంత్రిత్వ శాఖ ఉత్తరువు నంబర్ 250 22 / 28 / 2025- F. I ప్రకారం మరియు ఫారినర్ యాక్ట్ 1946 లోని సెక్షన్ 3 (1 )ప్రకారం పొందిన అధికారాలను ఉపయోగించి పాకిస్తానీ దీర్ఘకాల పౌరులకు వీసా సేవలను నిలిపివేయాలని నిర్ణయించబడిందన్నారు. ఈ పరిస్థితుల్లో మన జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని వీసా గడువు ముగిసిన వీసాలు  కలిగి ఉన్న లేదా వీసాలు సస్పెండ్ చేయబడిన పాకిస్తాన్ జాతీయులను వెంటనే గుర్తించాలని తాసిల్దార్ ని  కోరడం జరిగిందన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన మరియు తీవ్రమైన అంశం కావున అటువంటి వ్యక్తుల వివరాలను ఆలస్యం చేయకుండా గుర్తించి అవసరమైన విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు . ఇది చాలా సున్నితమైన అంశం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా స్థానిక పరిపాలన శాఖ వేగంగా తగిన నిర్ణయాలు తీసుకొని ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న పాక్ జాతీయులను వారి దేశానికి వెంటనే పంపించి భద్రతాపరమైన సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలోఈ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్,ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్,వెలదండి రాజేంద్ర ప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయికుంట చందు, గదాస్ రాంప్రసాద్,పెందోట భూషంకర్,మురళి మోహన్, చెన్నవేణి రవీందర్, వేల్పుల నాగార్జున, నారోజు నరేష్, ఆషాడం శ్రీనివాస్,పుదారి కిష్టయ్య, నార్లపురం సత్యం,అరుణ్, బొల్లి సుధాకర్, కుమారస్వామి,మల్లేష్, చంద్రశేఖర్ రెడ్డి,శంకర్ తదితరులు  పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *