మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన చేనేత మరియు పద్మశాలి సంఘం నేతలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గాజుల భగవాన్ నేత, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొలి వెంకట నారాయణ, పాము రాజన్న మార్కండేయ స్వామి ఆలయ బాద్యులు, వేముల వెంకట రమణ జనగామ గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు, సాదుల యాదగిరి, వేముల వీరాస్వామి, గాదాసు రాజు, వివిధ గ్రామాల పద్మశాలి సంఘం అధ్యక్షులు తదితరులను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..హుస్నాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలిల సమస్యలను, బలహీన వర్గాల శాఖ మంత్రి గా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తానని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో జౌళి శాఖ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నియోజకవర్గంలో ఉన్న పద్మశాలిలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం పద్మశాలి వర్గానికి చేయూతను అందిస్తూ వారి అభివృద్ధికి అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కేడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, చిత్తారి పద్మ, వల్లపు రాజు, బుక్య సరోజన, ఎండి హసన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

