హుస్నాబాద్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి. లక్ష్మారెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పి. లక్ష్మారెడ్డి, బుధవారం రోజు పదవీ బాధ్యతలు చేపట్టిన తదానంతరం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., ని కలసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సైని అభినందించి శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నూతన చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల రక్షణకు పెద్దపీట వేయాలని తెలిపారు. నేను సైతం కార్యక్రమం ద్వారా గ్రామాలలో పనిచేయని సీసీ కెమెరాలు గ్రామస్తులు మరియు వ్యాపారస్తులతో కలసి వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు. మరియు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. తరచుగా గ్రామాలను సందర్శించాలని తెలిపారు. విపిఓ వ్యవస్థను మరింత మెరుగుపరిచి వారంలో మూడు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్ళేటట్లు షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు.





