బోల్తాపడ్డ కొరియర్ కంటైనర్ లారీ.. బయటపడ్డ అక్రమ రేషన్ బియ్యం..
సిద్దిపేట టైమ్స్ దుబ్బాక ప్రతినిధి

అతివేగంతో వెళుతున్న కొరియర్ కంటైనర్ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. కంటైనర్ బోల్తా పడిన విషయం తెలవగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఏంటని కొరియర్ కంటైనర్ డోర్లు ఓపెన్ చేసి చూశారు. ఆక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఉండడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మర్రికుంట జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా పడడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొరియర్ కంటైనర్ లో రేషన్ బియ్యం తరలిస్తున్న విషయాన్ని గమనించి నిర్గాంత పోయారు. బోల్తా పడిన కంటైనర్ల నుండి బియ్యాన్ని మరో కంటైనర్ లోకి అక్రమార్కులు డంపు చేస్తున్నారు. దుబ్బాక ఎస్సై గంగరాజు తన సిబ్బందితో అక్కడికి రాగానే డ్రైవర్ తో సహా అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరిగా జారుకున్నారు. కంటైనర్ తో పాటు రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు స్టేషన్ కు తరలించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేసినప్పటికీ అక్రమార్కుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గత రెండు రోజుల క్రితం భూంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ప్రతిరోజు రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు యేదేచ్ఛగా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
