కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన పదార్థాలు..
చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్
సిద్దిపేట్ టైమ్స్ కోహెడ

కోహెడ మండల కేంద్రంలోని కరీంనగర్ డైరీలో కాలం చెల్లిన తిను బండారాలను అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం ద్వారా రోగాల బారిన పడే అవకాశం ఉంది. సదరు డైరీలో ఎప్పటినుంచి కాలం చెల్లిన పదార్థాలను అమ్ముతున్నారో అని వాపోతున్నారు. తిను పదార్థాలు నాణ్యతగా లేవని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే సంబంధిత సిబ్బంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అధికారులు ఇలాంటి దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
