తెలంగాణ మున్నూరు కాపుల అభివృద్ధికి 50 కోట్లతో కాపు సహకార సంఘాల సంస్థ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ 2024 సంవత్సరంలో జి.ఓ.ఎం.ఎస్.నెం. 19, బిసిడబ్ల్యు (డి) శాఖ, తేది 14.03.2024 తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ ఏర్పాటు చేశారని రాష్ట్ర మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్నూరు కాపు సమాజంలోని పేద ప్రజలపై దృష్టి సారించి వారి సమ్మిళిత వృద్ధిని ప్రొత్సహించడం ఈ కార్పోరేషన్ ప్రాథమిక లక్ష్యమని 2024-25 సంవత్సరానికి గాను తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ లిమిటెడ్ కొరకు యాబై కోట్లు ప్రగతి పద్దు క్రింద కేటాయించారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసికి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అఫిక్స్ కౌన్సిల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.