వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ        

వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ        

వర్గీకరణ జరిగితోనే నా జాతికి న్యాయం జరుగుతుంది..
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ          

సిద్దిపేట టైమ్స్ గజ్వేల్ :

ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవాలని చూస్తున్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.ఆదివారం గజ్వెల్ పట్టణంలో  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్  ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మంద కృష్ణ మాదిగ , ప్రొఫెసర్ ఖాసిం, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలగా  అలుపేరగకుండా పోరాటం చేసి సాధించుకున్న వర్గీకరణ ను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
రాజకీయ పార్టీల ప్రధాన నాయకులతో నాకు వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయని, నాజాతి బిడ్డల కోసంమే నావ్యక్తి గత సంబంధాలు ఉపయోగపడ్డాయన్నారు.
30 ఏళ్ల పోరాటంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ముందుకు వెళ్ళామన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మాదిగ పల్లేలో నిర్వహించిన పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో మాట్లాడుతూ బాగా చదువుకోండి త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నామని చెప్పారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని రాజకీయపార్టీలతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీలో నేను లేనని నాకు అందరితో సంబంధాలు ఉన్నాయన్నారు. జనాభాలో మాదిగలు ముందున్నప్పటికీ  అన్ని రంగాల్లో మాదిగలు వెనకబడి ఉన్నారన్నారు. 30 సంవత్సరాలుగా నేను ఏ రాజకీయ పార్టీ కండువా వేసుకోలేదన్నారు.నేను ఏ పార్టీకి వ్యతరేకం కాదు, సానుకూలం కాదన్నారు. బీసీ వర్గీకరణ జరిగినప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగడం న్యాయమే కదా అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే నా జాతికి న్యాయం జరుగుతుందనే నేను పోరాటం చేస్తున్నానన్నారు.  1997 లో వర్గీకరణ జరిగిందని రెండు నెలలోనే దానిని రద్దు చేశారన్నారు. దానితర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు వర్గీకరణ అమలు జరిగితే  దాన్ని2004లో  మళ్ళీ రద్దు చేయించారన్నారు.2023 లో ఎస్సి వర్గీకరణ కోసం సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందని ప్రస్తుతంఆఆనందం ఆవిరి చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కంటే  తెలంగాణలో ముందే వర్గీకరణ అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారనిఇచ్చిన మాట నిలుపు కొకుండా కమిషన్ ల పేరుతో కాలయాపన చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా వర్గీకరణ అంశం ఉందన్నారు. వచ్చే నెల 2న  లక్ష డప్పులతో హైదరాబాద్ దద్దరిల్లెల నిర్వహిస్తున్నామన్ని డప్పు మాదిగల సంస్కృతికి వాయిద్యం అనిఅన్నారు. వర్గీకరణ అనివార్యమైతే ఊరుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *