25 న హుస్నాబాద్ లో కవి సమ్మేళనం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 25 బుధవారం రోజున జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో కవి, గాయక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు ముక్కెర సంపత్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ చైతన్యానికి సాహిత్యం మూలస్తంభం లాంటిదని అన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపుటకు సాహిత్యం దోహదపడుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో మనుషులంతా యాంత్రిక జీవనంతో బతుకు వెళ్ళదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే హుస్నాబాద్ లో ప్రతి నెల 25వ తారీఖున కవి గాయక సమ్మేళనం నిర్వహిస్తామని అన్నారు. ఆరోజున కవులు, రచయితలు, గాయకులు హాజరై తమ కవితాగానం వినిపిస్తారని అన్నారు. ఈనెల జరగనున్న ప్రథమ సమావేశం ప్రముఖ కవి దేవర కనకయ్య వాళ్ల ఇంట్లో సాయంత్రం 6 గం.కు నిర్వహిస్తున్నామని హుస్నాబాద్ పట్టణంతోపాటు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న కవులు రచయితలు గాయకులు తప్పకుండా హాజరు కావాలని సంపత్ తెలియజేశారు