హుస్నాబాద్ లో అంబులెన్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
సిబ్బంది పనితీరుపై ప్రశంసలు – సలహాలు, సూచనలు ఇచ్చిన అధికారులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 102, 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను సోమవారం అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఈ.ఎమ్.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ అనుసంధానంతో నడుస్తున్న ఈ సేవలపై రాష్ట్ర నాణ్యత విభాగం (క్వాలిటీ డిపార్ట్మెంట్) ప్రత్యేక దృష్టిసారించింది.
ఈ తనిఖీల్లో క్వాలిటీ డిపార్ట్మెంట్ అధికారి కిషోర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్, జిల్లా మేనేజర్ శ్రీ హరి రామకృష్ణ పాల్గొన్నారు. హుస్నాబాద్‌లోని రెండు 108 అంబులెన్స్‌లు, ఒక 102 అమ్మఒడి వాహనాన్ని పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా అధికారులు వాహనాల్లోని వైద్య పరికరాల పనితీరు, అవసరమైన రికార్డులు, సిబ్బంది పని తీరు వంటి అంశాలను బట్టి సమీక్షించారు. సిబ్బంది విధులు నిర్వహణలో నిష్టతో ఉన్నారని ప్రశంసించారు. అలాగే సిబ్బందితో సమస్యలు, అనుభవాలపై చర్చించి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకున్నారు.
అధికారులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ఈ సేవలపై నిర్లక్ష్యం వీలుకాదని స్పష్టంగా సూచించారు. మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ తనిఖీల్లో హుస్నాబాద్ 108 అంబులెన్స్ పైలట్ సతీష్ రెడ్డి, ఈఎంటీ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.