ఘనంగ శ్రీ మహా రేణుక ఎల్లమ్మకు లక్ష పుష్పార్చన..
లక్ష విరాళం అందజేసిన కె.వి.ఆర్
సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట ప్రతినిధి,

శ్రావణమాసంలో భాగంగా చివరి మంగళవారం సిద్దిపేట శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి మహాభిషేకము, లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగ జరిగింది. ఈ సందర్బంగ దేవాలయంలో అమ్మవారిని అత్యంత సుందరంగ ఆలంకరించారు. ఉదయం మహనివేదన కార్యక్రమంతో ఉత్సవం ప్రారంభమైంది. అనంతరం మహాఅభిషేకము, లక్ష పుష్పార్చన వేదపండితులు… ప్రత్యక పూజలు నడుమ కోనసాగింది.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకుని, ప్రత్యక పూజలు నిర్వహించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధి కొసం లక్ష రూపాయలు విరాళం అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రం జరిగింది.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.






