ప్రభుత్వ భూమి కబ్జా.. డంపు యార్డు గేటుకు అడ్డుగా నిర్మాణం..
ఆక్రమిత స్థలాల్లో వెలిసిన షెడు
నోరు మెదపని రెవెన్యూ, మునిసిపల్ అధికారులు..
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి;
సిద్దిపేట మున్సిపాలిటీలో భూ కబ్జాల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. సిద్దిపేట డంపింగ్ యార్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించేశారు. ఆక్రమించిన భూమిలో రాత్రికి రాత్రి పలకలతో షెడ్లు హడావుడిగా నిర్మించారు. అధికారులు ఆ వైపునకు కన్నెత్తి చూడటం లేదా.. లేక ఎమైన చేతులు తడిపారో అందుకే తెలిసినా తెలియనట్టు వ్యవరిస్తున్నారన్న విమర్శలు అంటగట్టుకుంటున్నారు అధికారులు..
సిద్దిపేట హౌసింగ్ బోర్డు రహదారి పక్కనే పట్టణ శివారు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఉంది. అక్కడే సర్వే నంబర్ 1668 లో మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డు ఉంది. డంపు యార్డు అనుకుని కోంత ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిపై కోందరు కన్ను పడింది. దీంతో ఈ భూమి ఆక్రమణకు పక్కా ప్రణాళికను రూపొందించి పక్కన ఉన్న పట్టా భూమి సర్వే నంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని దర్జాగా కబ్జా చేశారు. డంపు యార్డులోని చెత్తను తరలించేందుకు ఎర్పాటుచేసుకున్న డంపు యార్డు గేటు కు అడ్డంగా నిర్మాణం చేసి కబ్జా చేయటం మరో ట్విస్ట్.. అయినా రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఇ సంగతి తెలియదని చేతులు దులుపుకున్నారు. దీని పై ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.