కక్షసాధింపులు కాదు.. హామీల అమలుపై దృష్టి పెట్టండి..
కళ్యాణ లక్ష్మీ చెక్కులు అడ్డుకుంటారా..?
ప్రజలకు సేవ కోసం పోటీ పడాలి..
ఇంచార్జి మంత్రి చెబితేనే.. అభివృద్ధి కార్యక్రమాలా..
ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రి లిఫ్ట్ చేయరా..?
6 మాసాల పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం..
ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి..
సిద్దిపేట టైమ్స్, చేగుంట
6 మాసాల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రజా పాలన గాలికి వొదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం చేగుంట లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ నేడు డోఖా చేసిందన్నారు. ప్రజలకు సేవలు అందించడం పక్కన పెట్టి కక్షసాధింపులు చేస్తున్నారన్నారు. ఏడాదిన్నర కాలంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేయడం లేదని, తొగుటలో 37 మందికి చెక్కులు శనివారం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇంచార్జి మంత్రి పేరిట రద్దు చేయడం గర్హనీయమన్నారు.. ఈనెల 27 వరకే చెక్కులకు గడువు ఉండటంతో ఈ విషయంలో స్పందించాలని మంత్రి గారికి పలుమార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదన్నారు.. ఇదేనా మీరు ఎమ్మెల్యే కు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల ద్వారా పూర్తి చేసిన భవనాలు, రోడ్లు తదితర అభివృద్ధి పనులు ప్రారభించకుండా అడ్డుకుంటున్నారన్నారు.. మీ రన్నా కార్యక్రమం ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.. రాష్ట్రంలో 6 మాసాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందన్నారు.. పాఠశాలలు ప్రారంభం కాగా, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, కేవలం కేసీఆర్ ఫొటో ఉందన్న కారణంతో పేజీలు చింపివేసి అతికించి, ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో సాగునీటి, తాగునీరు, విద్యుత్, అభివృద్ధి, సంక్షేమం మీద ఎల్లప్పుడూ దృష్టి సారించేవారన్నారు. నేడు ఆస్పత్రులతో సహా అన్ని వ్యవస్థలు కుంటుపడ్డాయన్నారు.. ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.. అనంతరం చేగుంట మండలంలోని శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత 19వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు..