హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..

హుస్నాబాద్: బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ లు?..

బడులు ప్రారంభమైన విద్యార్థులకు అందని బస్ పాస్ ఫారాలు…

3000 మంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్ విద్యార్థులు.

వరుస ప్రమాదాలపై స్పందించని ఆర్టిసి ఉన్నతాధికారులు..

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి డిపో అభివృద్ధికి మరింత కృషి చేయాలి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్.

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

విద్య సంవత్సరం మొదలై పదిహేను రోజులు అవుతున్న నేటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బస్ పాస్ ఫారాలు ఇవ్వడం కోసం ప్రక్రియ మెదలు పెట్టక పోవడం హుస్నాబాద్ డిపో మేనేజర్, సంబంధిత అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు.

సోమవారం నాడు గడప మల్లేష్ విలేకరులతో మాట్లాడుతుా..హుస్నాబాద్ నియోజకవర్గంలో కొహెడ, చిగురుమామిడి, హుస్నాబాద్ మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి వరకు కూడా బస్ పాసుల దరఖాస్తు ఫారాలు అందించడంలో హుస్నాబాద్ ఆర్టిసి డిపో మేనేజర్, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆర్టిసి అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడల్ స్కూల్ విద్యార్థులే సుమారు 3000 వెల మందికి పైగా ఉంటారని బస్ పాస్ ఫారాలు అందించడంలో ఆర్టిసి అధికారుల జాప్యం ఎందుకు చేస్తున్నారో డిపో మేనేజర్ విద్యార్థుల తల్లిదండ్రులకు జవాబు వెంటనే చెప్పాలని గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బస్ సర్వీసులు  నడిపించేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేయాలన్నారు.

డిపొ మేనేజర్, ఎయంఎఫ్  పర్యవేక్షణ కొరవడి
రోడ్డు ప్రమాదాలు.

హుస్నాబాద్ నుండి కరీంనగర్, హుజురాబాద్, జనగాం రూట్లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు డిపో మేనేజర్, ఎయంఎఫ్ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని అందువల్లనే నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గడిపె మల్లేశ్ అన్నారు. డిపోలో ఉన్న ఆకొద్ది పాటి  ప్రభుత్వ, ప్రయివేటు బస్ సర్వీసుల కండిషన్ ఎలా వున్నాయని డిపో మేనేజర్, ఎయంఎఫ్ పర్యవేక్షణ చేయక పోవడం ప్రతి రోజు డ్యూటి చేసే డ్రైవర్ లకు పెట్టె  బ్రితింగ్ మిషన్ నెల రోజులుగా పెట్టకుండా డిపోలో ఎం జరుగుతుందో తెలుసుకోలేని డిపో మేనేజర్ విధుల పట్ల నిర్లక్ష్యం చేయడం  మూలంగా వరుస ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, మేనేజర్, ఎయంఎఫ్ పనితీరుపై గడిపె మల్లేశ్ మండిపడ్డారు.

ఇంత జరుగుతున్న ఆర్టిసి ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించక పోవడంలో అంతర్యం ఏమిటని ప్రజల, ప్రయాణీకుల ప్రాణాలు అంటే ఇంత నిర్లక్ష్యం చేయడం ఆర్టిసి అధికారులకు సరికాదని అన్నారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పొలీస్ శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకోని డిపో మేనేజర్ వెంటనే ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించి కరీంనగర్, హుజురాబాద్, జనగాం, సిద్దిపేట, హన్మకొండ రోడ్డు మార్గాల్లో ప్రమాదాల నివారణకు మూల మలుపులు ఉన్నచోట స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని, ఇసుక, గ్రానైట్ అధిక లోడుతో పోవడం వల్ల గుంతలు పడ్డ రోడ్లను వెంటనే పూడ్చి, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు తావిస్తుందని అన్నారు. ఆర్ అండ్ బి, ఆర్టిసి అధికారులు నిద్రావస్థలో ఉన్నా కారణంగానే  ప్రమాదాలు జరుగుతున్నాయని తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, గుంతలు పడిన బిటి రోడ్లను పూడ్చేసి ప్రజల, ప్రయాణికుల ప్రాణాలు కాపాడలని ఆర్టిసి, ఆర్ అండ్ బి అధికారులను గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *