ప్లాస్టిక్ కవర్లు వద్దు జ్యూట్ బ్యాగులు ముద్దు
మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ (CYCLOTHANS) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరైనారు. ప్రభుత్వ బాయ్స్ హై స్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థి విద్యార్థినులు తమ సైకిళ్ల తో పురపాలక సంఘ కార్యాలయం నుండి గాంధీ చౌరస్తా వరకు సైకిల్స్ మీద స్లొగన్స్ చేస్తూ ర్యాలీలో నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహం చుట్టూ మానవహారంలా ఏర్పడి స్వచ్ఛతపై, పర్యావరణంపై, చెత్త విభజనపై, ప్లాస్టిక్ నిషేధంపై డ్రాయింగ్ గీసిన చార్ట్ ను ప్రదర్శిస్తూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించి జ్యూట్ బ్యాగులను వాడాలని, చెత్తను తడి చెత్త పొడి చెత్త మరియు హానికరమైన చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతలో ముందు ఉంచాలని, హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా తీర్చిదిద్దడంలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్స్ దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, స్కూలు ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, వార్డ్ ఆర్పి, జవాన్లు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
