మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..ఇదొక మోసమని గుర్తించండి..విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

మనీ సర్క్యులేషన్ పేరుతో మోసం..
యువకుడి ఆత్మహత్య..
ఇద్దరు నిందితుల అరెస్టు..
మనీ సర్కులేషన్ స్కీముల్లో ఎవరూ పెట్టబడులు పెట్టొద్దు..
ఇదొక మోసమని గుర్తించండి..
విజయ్ కుమార్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట

సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట, అక్టోబర్ 13:

క్యూనెట్ పేరుతో మనీ సర్కులేషన్ మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. వర్గల్ మండలం వేలూర్ గ్రామానికి చెందిన బడుగు హరి కృష్ణ(26) అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ద్వారా అధిక లాబాలు వస్తాయని ఆశపడి పెట్టుబడి పెట్టి నష్ట పోయాడు. దీంతో అప్పులు తీర్చేందుకు వ్యాపారం చేద్దామని మనీ సర్కులేషన్ స్కీంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. దీంతో మనస్తాపం చెందిన హరికృష్ణ సూసైడ్ నోట్ రాసి తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఉప్పలపు అలేఖ్య(25) కల్వల మణి కంఠా రెడ్డి(23)లను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు చెప్పారు. పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ కథనం ప్రకారం… బడుగు హరికృష్ణ బెట్టింగ్ యాప్ లలో రూ.8 లక్షలు నష్టపోయి అప్పుల పాలయ్యాడు. దీంతో  అతని తండ్రి నాగరాజు రూ.8 లక్షలు అప్పులు తెచ్చి ఇవ్వడంతో హరికృష్ణ అప్పులు తీర్చారు. తండ్రి తెచ్చిన  రూ. 8 లక్షల అప్పును తీర్చడానికి వ్యాపార మార్గాలు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కల్వల మణి కంఠా రెడ్డి(23) పరిచయం అయ్యాడు. తాను కొంత పెట్టుబడి పెట్టి అధిక మొత్తం లో లాభాలు పొందుతున్నట్లు మణి కంఠా రెడ్డి హరికృష్ణకు తెలిపాడు. తన లాగే కొంత డబ్బు పెట్టుబడి పెడితే అధిక మొత్తములో డబ్బులు సంపాదించవచ్చని చెప్పాడు. ఇందుకోసం క్యూ నెట్ మనీ సర్కులేషన్ స్కీంలో చేరితే అధిక లాభాలు వస్తాయని మణికంఠా రెడ్డి, మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం గ్రామానికి చెందిన అతని పెద్ద నాన్న కూతురు ఉప్పలపు అలేఖ్య(25) కలిసి హరికృష్ణను నమ్మించారు. వారు చెప్పిన విధంగా హరికృష్ణ గత జులై నెలలో సికింద్రాబాద్ లోని టాంక్ బండ్ ఎదురుగా గల మారియెట్ హోటల్ లో జరిగిన సమావేశానికి హరికృష్ణ హాజరయ్యాడు. తనతో పాటు తన తండ్రి నాగరాజును, తన స్నేహితుడిని తీసుకు వెళ్ళాడు. e సమావేశంలో వారు హరికృష్ణ వద్ద రూ. నాలుగు లక్షలు తీసుకొని అతనికి క్యూ నెట్ మనీ సర్కులేషన్ స్కీంలో సభ్యత్వం ఇచ్చారు. తరువాత బిజినెస్ ప్రమోషన్లో భాగంగా హరికృష్ణకి పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే ఒక ట్రిప్ సేవర్ కూపన్, ఒక చేతి గడియారం ఇచ్చారు. ఆ తరువాత హరికృష్ణ హైదరాబాద్ లోని పలు ఖరీదైన హోటళ్లలో జరిగిన సెమీనారులకి ఆలేఖ్య, మణికంఠా రెడ్డిలతో కలిసి హాజరయ్యాడు. ఈ సెమినార్లలో మాట్లాడిన వారి మాటల ద్వారా తను పని చేసే సంస్థ క్యూ నెట్ ప్లాట్ ఫాం(ఆన్లైన్ పోర్టల్) కు  అనుబంధంగా భారత దేశం లో  విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా తన వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తున్నారని హరికృష్ణ తెలుసుకున్నాడు. బిజినెస్ ప్రమోషన్లో బాగంగా కంపెనీ సేమీలగ్జరీ ఉత్పత్తులు చేతి గడియారాలు, ఆభరణాలు, ట్రిప్ సేవర్, హెల్త్, వెల్ నెస్  ఫ్యూరిఫైడ్ వాటర్ వంటివి అమ్మితే ఎవరూ కొనరనీ, వాటికి అంత విలువ ఉండదనీ తెలిసిన వ్యక్తులు, బంధువులు, చిన్ననాటి మిత్రులను, క్యూ నెట్ మనీ సర్కులేషన్ స్కీంలో సభ్యులుగా చేర్పించి రూ.4 లక్షలు కట్టిస్తే ఒక్క సభ్యుని ద్వారా రూ 50 వేల కమిషన్ వస్తుందని  తెలియడంతో తాను మోసపోయానని హరికృష్ణ గ్రహించాడు. సభ్యులను చేర్పించారు. నాలుగు లక్షలు కట్టిస్తే వారు తనలాగే మోసపోతారని గ్రహించిన హరికృష్ణ తనలో తాను బాధ పడి మనస్తాపంతో తేదీ ఈ నెల 9వ తేదీన తన ఇంటిలో సూసైడ్ నోట్ రాసి ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని  తండ్రి నాగరాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి నిందితులైన మణికంఠారెడ్డి, అలేఖ్యాలను అరెస్టు చేసి జ్యుడీషియల్ డిమాండ్ కు పంపినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.

*క్యూ నెట్ ఒక మహమ్మారి ఎవరూ నమ్మవద్దు*

క్యూ నెట్ తదితర ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్  బెట్టింగ్ లలో డబ్బులు పెట్టి ఎవరూ మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కమిషనర్ విజయ్ కుమార్ సూచించారు.    హైదరాబాద్ లో పలువురు ఇలాంటి స్కీమ్ ల్లో చేర్పించి అమాయకులను మోసం చేస్తున్న వారిని పట్టుకుకుని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది మోసమని, ఎలాంటి ఉత్పత్తి ఉండదన్నారు.  ఇలాంటి మనీ సర్కులేషన్ స్కీమ్ లపై 1978 లోనే నిషేధిస్తూ చట్టం చేశారని చెప్పారు. ఎవరూ ఇలాంటి స్కీమ్ ల్లో చేరడం, చేర్పించడం చేయవద్దన్నారు.  క్యూ నెట్ అనేది ఓ మహమ్మారి లాంటి స్కీమ్ అని,దీనిలో చేరితే లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటారని చెప్పారు.  క్యూ నెట్ సింగపూర్ వేదికగా నిర్వహిస్తున్నారన్నారు. ఇదొక విషవలయం లాంటిదని తెలిపారు. ఇలాంటి వాటిలో చేరే వారు ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటారని వివరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కటినంగా శిక్షిస్తామన్నారు.  క్యూ నెట్ వంటి వాటిని ప్రమోట్ చేయడం నేరమని, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే చట్టం ముందు దోషులే అని చెప్పారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుకోకుండా ఏదైనా సైబర్ నేరం జరిగితే  వెంటనే 1930 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఇలాంటి మోసాలపై డయల్ 100  లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్  8712667100 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. మీడియా సమావేశంలో  అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, గజ్వేల్ ఏసీ లపీ నరసింహులు, గజ్వేల్ రూరల్ సిఐ మహేందర్ రెడ్డి, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *