నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయ్యాలి..
హుస్నాబాద్ టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ పనులు పుర్తి చేసి జంక్షన్ డెవలప్ మెంట్ పనులు మొదలు పెట్టాలి
పందిల్ల-కుచన్ పల్లి వద్ద టోల్ గేట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారుల సహకారంలో భూసేకరణ
జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి
సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి,

నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి నేషనల్ హైవే అధికారులు మరియు కాంట్రాక్టర్ ని ఆదేశించారు.
సోమవారం సమికృత జిల్లా కార్యాలయల సముదాయంలోని కాన్ఫరెన్ హాల్ లో నేషనల్ హైవే ఇంజనీర్ మరియు కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… మెదక్ ఎల్కతుర్తి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా సిద్దిపేట నుండి జిల్లా పరిది చివరి ప్రాంతం వరకు నేషనల్ హైవే నిర్మాణ పనులు వేగంగా పూర్తి చెయ్యాలని తెలిపారు. ముక్యంగా హుస్నాబాద్ టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ పనులు పుర్తి చేసి జంక్షన్ డెవలప్ మెంట్ పనులు మొదలు పెట్టాలని తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులు కాంట్రాక్టర్ లకు ప్రోత్సాహం అందించాలని తెలిపారు. అలాగే పందిల్ల దగ్గర బ్రిడ్జి పనులు నిర్మాణంలో వేగం పెంచాలని బ్రిడ్జి నిర్మాణం పూర్తనా పనులలో స్ట్రెంచ్ వర్క్ ఒక వారం లో పూర్తి చెయ్యాలి. పందిల్లా-కుచన్ పల్లి వద్ద టోల్ గేట్ నిర్మాణానికి రెవెన్యూ అధికారుల సహకారంలో భూసేకరణ పనులు పూర్తి చెయ్యాలని, గ్రావెల్ ఫిల్లింగ్ కొరకు ఇతరాత్ర శాఖల నుండి అన్ని అనుమతులు తీసుకోవాలని తెలిపారు. రోడ్ వెంబడి దేవాలయాల వలన కొంత పనులు ఆగడం వలన వాటి గూర్చి స్థానిక ప్రజలతో సానుకూలంగా చర్చించి ప్రోసిజర్ ప్రకారం షిప్ట్ చెయ్యాలని తెలిపారు. అందరు అధికారుల సమన్వయము తో నేషనల్ హైవే పనులు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా లో హుస్నాబాద్ ఆర్డివో రామ్మూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నేషనల్ హైవే ఏఈ లు అనురాగ్, శ్రీనివాస రావు, కాంట్రాక్టర్ నేమి చందు తదితరులు పాల్గొన్నారు.