నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ జాతియ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా హుస్నాబాద్ అభ్యర్థి బల్ల అరుణ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
నాణ్యత లేని, కల్తీ వస్తువులను దర్జాగా విక్రయిస్తున్న వారిని నిలదీసే హక్కు ప్రతి వినియోగదారునికి ఉందని, వినియోగదారులకు వారి హక్కుల పై అవగాహన కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బల్ల అరుణ్ అన్నారు బల్ల అరుణ్ ను NCRC తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా నియమిస్తూ NCRC ఫౌండర్, జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లు శనివారం హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమం లో నియామకపు ఉత్తర్వులు అందచేశారు. ఈ సందర్భంగా బల్ల అరుణ్ మాట్లాడుతూ కొంత మంది స్వార్ధపరులు సొంత లాభం కోసం చిన్నపిల్లలు తాగే పాల దగ్గరి నుండి ప్రాణాపాయ పరిస్థితులలో అందించే ఔషధాల వరకు అన్నిటిని కల్తీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, మరో వైపు కార్పోరేట్ కంపెనీలు, బడా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్ లు నిర్లక్ష్యంతో కాలం చెల్లిన నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తున్నాయని ప్రతి రోజు పత్రికల్లో చూస్తూనే ఉన్నామని ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకు NCRC వినియోగదారులకు అండగా ఉంటుదని బల్ల అరుణ్ తెలిపారు. రాష్ట్రం పరిధిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వినియోగదారులు తనను సంప్రదించాలని బల్ల అరుణ్ కోరారు. చట్ట పరంగా తమ హక్కులను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పోరాడి కల్తీభూతాన్ని తరిమి కోట్టాలని పిలుపు నిచ్చారు. తనకు పదవి ఇచ్చిన NCRC ఫౌండర్, జాతియ చైర్మన్ Dr MVL నాగేశ్వర రావు , తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Posted inహుస్నాబాద్
నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా హుస్నాబాద్ అభ్యర్థి బల్ల అరుణ్
