హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాటం బృందాలు పౌరాణిక జానపద సంస్కృతి జాతర పోస్టర్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున విజయవంతం చేయండి అని పిలుపునిచ్చిన…. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన రేణుక ఎల్లమ్మ దేవాలయం దగ్గర తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ఆవిష్కరణ చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న. ఈ సందర్భంగా మాట్లాడుతూ… హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు మహిళా కోలాట బృందం పౌరాణిక జానపద సాంస్కృతి జాతర ఆదివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని సంఘమిత్ర బీఈడీ కళాశాలలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణంలోని ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులు పౌరాణికము మహిళా కోలాట బృందాలు తెలంగాణ సంస్కృతిక చిహ్నమని ఆమె అన్నారు. మన ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ పౌరాణిక మహిళా కోలాట కళపట్ల కృషి చేయడము అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మన సంస్కృతిని సాంప్రదాయాలను కళల పట్ల నేటి యువతకు బాధ్యత ఉందని వాటికోసం కృషి చేయాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మాజీ హుస్నాబాద్ మండల పరిషత్ అధ్యక్షులు ఆకుల వెంకన్న, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్, కాంగ్రెస్ నాయకులు పున్న సది, స్వశక్తి భవన కార్మిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోయిన చంద్రయ్య, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.