బిజెపి పార్టీలో ముసలం
– జిల్లా అధ్యక్షుల నియామకల్లో అవకతవకలు
– సీనియర్ నాయకులను గుర్తించని బిజెపి అధిష్టానం
– త్వరలో పార్టీ విడనున్నట్లు అంతర్గత సమాచారం ?
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్ష పదవి నియామకం పట్ల జిల్లా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీని అంటి పెట్టుకొని గత 30 సంవత్సరాలుగా సంఘ సంస్థ కార్యకర్త నుండి మొదలుకొని ఏబీవిపీలో కీలక బాధ్యతలు పోషించి , అనంతరం భారతీయ జనతా పార్టీలో అనేక పదవులు చేపట్టిన సీనియర్ నాయకులు అంబటి బాలేష్ గౌడ్, మొన్న జరిగిన జిల్లా అధ్యక్షుని రేసులో ఉండడం అందరికి తెలిసిందే, బిజెపి రాష్ట్ర అధిష్టానం గత మూడుసార్లు బీసీ బిడ్డ అయిన అంబటి బాలేష్ గౌడ్ మొండి చేయి చూపించింది. కానీ ఈసారి అయినా జిల్లా అధ్యక్షుని పదవి అప్పజెప్తారని బిజెపి శ్రేణులు నమ్మకం కుదరగా, అధిష్టానం మాత్రం ఎవరికి తెలియకుండా, వేరే వ్యక్తికి ఇవ్వడం బాధాకరం, నేడు బిజెపి ఇచ్చిన వ్యక్తి భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం కూడా లేదు అని బిజెపి శ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. కానీ అంబటి బాలేష్ గౌడ్ జిల్లా అధ్యక్ష పదవి రాకపోవడంతో పార్టీలో అంతర్గత విభేదాలు నెల కొన్నాయి. ఏది ఏమైనా జిల్లా అధ్యక్ష పదవి రాకపోవడంతో తన అనుచరులతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి పార్టీ వీడన్నట్లు సమాచారం …? ఏది ఏమైనా సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్ష పదవి రాష్ట్ర పార్టీకి సమస్యల నెలకొన్నది.
బిజెపి పార్టీలో ముసలం





