
లాయర్ ఆవతారమేత్తిన ఎంపీ రఘునందన్ రావు..
మెదక్ జిల్లా కోర్టుకు వెళ్లిన ఎంపీ రఘునందన్..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో
ఎంపి రఘునందన్ రావు నల్ల కోటు ఎసుకుని కోర్టు మెట్లు ఎక్కి లాయర్ అవతారమేత్తారు.. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన ఇరువర్గాల ఘర్షణలో పోలీసులు గోరక్షకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఈ విషయంలో గోరక్షకుల తరఫున వాదించేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కోర్టుకు వెళ్లారు. గోరక్షకులకు బెయిల్ కోసం స్వయంగా న్యాయస్థానంలో వాదించేందుకు వచ్చిన ఎంపీని చూసేందుకు పలువురు వచ్చారు. కోర్టులో గోరక్షకుల తరపున వాదించటం పలువురిని ఆకట్టుకుంది..






