అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు
- పెట్రోల్ పంపులో ఫైర్ సిబ్బంది అవేర్నెస్ ప్రోగ్రాం
సిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక ప్రతినిధి
అగ్నిమాపకంతో అప్రమత్తంగా ఎలా ఉండాలో పెట్రోల్ పంపులో ఫైర్ సిబ్బందికి అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కమలాకర్ అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని శిశిర పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై బంక్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంక్ లో ప్రమాదాలు చోటు చేసుకుంటే తక్షణమే స్పంధించాల్సిన తీరు, నియంత్రించే విధానాల పై అవగాహన కల్పించామన్నారు. స్థానిక వనరులతో ప్రమాదాన్ని ఎలా నివారించాలో వివరించామన్నారు.నూతనంగా నిర్మించిన శిశిర పెట్రోల్ పంపులో వచ్చే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు పంపు యజమానులకు సూచనలు తెలియజేశారు. పెట్రోల్ పోస్తున్న సమయంలో కానీ ఎవరైనా సిగరెట్ సేవిస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్లు అయితే వాటిని ఎలా ఆర్పాలో ఫైర్ సిబ్బంది, పెట్రోల్ పంప్ సిబ్బందికి యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది వినోద్,నరేందర్ ,ప్రభాకర్ ,శ్రీధర్ , పెట్రోల్ పంప్ సిబ్బంది యజమాన్యం పాల్గొన్నారు.
