హుస్నాబాద్‌లో మోదీకి పాలాభిషేకం – జీఎస్టీ తగ్గింపుపై బీజేపీ నేతల సంబరాలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, సెప్టెంబర్ 6: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, రైతులకు ఊరటనిచ్చేలా కేంద్రం జీఎస్టీ పన్నుల్లో భారీ తగ్గింపులు అమలు చేయనున్న నేపథ్యంలో హుస్నాబాద్ టౌన్ బీజేపీ నాయకులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
శనివారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రానికి పాలాభిషేకం చేసి కొత్త పన్ను సంస్కరణలను స్వాగతించారు.
కొత్త జీఎస్టీ స్లాబుల పై పట్టణ బిజెపి అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ— గతంలో అమల్లో ఉన్న నాలుగు పన్ను స్లాబులను రద్దు చేసి ఇకపై రెండు స్లాబులు (5% మరియు 18%) మాత్రమే అమల్లోకి వస్తున్నాయని వెల్లడించారు. ఈ నెల 22 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఏఏ వస్తువులపై తగ్గింపు?
నిత్యావసరాలు: హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లపై 5% జీఎస్టీ
ఆహార పదార్థాలు: వెన్న, నెయ్యి, పరోటాలు, బెకరీ ఉత్పత్తులు, సలాడ్స్ తదితరాలపై 5%
ఆరోగ్య భీమా, వ్యక్తిగత భీమా, జీవిత భీమాపై 0% పన్ను
వ్యవసాయ పరికరాలు: ట్రాక్టర్లు, బయో పెస్టిసైడ్స్, డ్రిప్ పైపులు, స్ప్రింకర్లపై 5%
ఎలక్ట్రానిక్స్: టీవీలు, ల్యాప్టాప్లపై 5% తగ్గింపు
ఈ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మోదీ ప్రభుత్వ ముందడుగని పేర్కొన్నారు.
వోకల్ ఫర్ లోకల్ : “స్థానిక వ్యాపారస్తులు బలంగా ఉండేందుకు స్వదేశీ వస్తువులను వినియోగించాలని, ప్రధాన మంత్రి ఇచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ పిలుపునకు అందరూ తోడ్పడాలి” అని శంకర్ బాబు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల నాగార్జున్, బోడిగే వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారి, కార్యదర్శులు వడ్డెపల్లి లక్ష్మయ్య, ఆకోజు అరుణ్ కుమార్, బొప్పిశెట్టి సాయిరామ్, కోశాధికారి బుర్ర రాజు, సీనియర్ నాయకులు బొనగిరి రవి, తోట సమ్మయ్య, వరియోగుల అనంతస్వామి, అలాగే ఇతర బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.





