సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని బీఎస్పీ ఆఫీసులో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై హుస్నాబాద్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై మోడీజీ మౌన వ్రతం విడాలి!!!ఇంట్లో పిల్లి బయట పులిలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వైఖరి ఈ దేశ ప్రజలకు స్పష్టంగా కనబడుతుంది అని అన్నారు. విద్యార్థులతో పరీక్ష పే చర్చ ద్వారా మాట్లాడే మోడీజీ మౌనంగా ఎందుకు ఉన్నాడు..24 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా నీటి ప్రవేశ పరీక్ష రాస్తే ప్రశ్న పత్రం లీక్ అయిందని మీడియాలో స్పష్టంగా రావడం జరిగిందని, ఒకే సెంటర్లో 8 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 60 మందికి 720 మార్కులు రావడం అనుమానాలకు దారి తీస్తుంది. గ్రేస్ మార్కుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా 1530 విద్యార్థులకు మార్కులు కలపడం ఏమిటి అని బిఎస్పీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము అని అన్నారు. ఇలాంటిమోసం చేసేవారు డాక్టర్లైతే ఈ దేశ ప్రజల పరిస్థితి ఏమిటని ఒక వైపు సుప్రీంకోర్టు అడుగుతుంది. విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ పరీక్షలు రాస్తారు. ఇట్టి పరీక్ష కొరకు ఎంతో శ్రమను, డబ్బులు ఖర్చు పెడుతూ తల్లిదండ్రులకు దూరంగా వివిధ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ప్రిపేర్ అయి పరీక్షలు రాస్తారు. ఈరోజు స్వయంగా ఒక విద్యార్థి నేను 30 లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రం కొనుక్కున్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇట్టి అవకతవకలు బిజెపి పాలిత రాష్ట్రాలైన బీహార్ హర్యానా గుజరాత్ లో జరగడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఇట్టి నీటి పరీక్షను దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA ) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి విషయంలో ఈడీ సిబిఐతో విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం జరపాలని బీఎస్పీ పార్టీ ( B SP) హుస్నాబాద్ నియోజకవర్గం పక్షాన డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయని పక్షంలో తీవ్ర ఆందోళనలకు సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బి ఎస్ పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్, సీనియర్ నాయకులు సుధాకర్, నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.