శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి..
సిద్దిపేట టైమ్స్, తిరుమల

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీవారి సేవలో తరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లోక కళ్యాణర్థం.. ప్రజలంతా సుఖసంతోషాల ఉండాలని, పాడి పంటలు సంవృద్ధిగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట గురువారెడ్డి, వంగ లింగారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సుర్యకరణ్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్యాంరెడ్డి, శ్రీరాం తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.