హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు మిషన్ భగీరథ నీటి పన్ను రద్దు చేయాలని ధర్నా
మిషన్ భగీరథ నీటి పన్ను పై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి
పాత బకాయిలు బలవంతంగా వసూలు చేయవద్దు
హుస్నాబాద్ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకుని వచ్చిన మిషన్ భగీరథ నీటి కనెక్షన్ కు నీటి పన్ను రద్దు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని కోరుతూ బిఆర్ఎస్, బీఎస్పీ, బిజెపి నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మిషన్ భగీరథ నల్ల బిల్లులు ఏనాడు వసూలు చేయలేదు. ఈ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చామని, నీటి బిల్లులు ఉండవని చెప్పారు. దీనితో హుస్నాబాద్ పట్టణం లో మరియు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కనెక్షన్ తీసుకున్నారు. ఇట్టి కనెక్షన్ లు ఇచ్చి దాదాపు 7 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నీటి పన్ను బిల్లు కట్టు అంటే ఎలా కడతారని అన్నారు. ఈ సమస్యను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హుస్నాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లి నల్ల బిల్లులు మాఫీ చేయాలని కోరారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని చెప్పిందని అన్నారు. ఈ సందర్భంగా ఈ సమస్యను కమిషనర్, మున్సిపల్ పాలకవర్గం ప్రజల మీద భారం పడకుండా మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉందని పట్టణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఐలెని మల్లికార్జున్ రెడ్డి, బీఎస్పీ హుస్నాబాద్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బిజెపి నాయకులు కవ్వ వేణుగోపాల్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.