సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు..
ఈ నెల సెప్టెంబర్ లో ఆకాశంలో అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి. ఈ అద్భుతాలను మీరు అస్సలు మిస్ అవ్వకూడదు.. ఆ అద్భుతమైన ఖగోళ సంఘటనలు ఇవే..!!
సెప్టెంబర్ 7.. బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు నాటకీయమైన ఎరుపు రంగులోకి మారతాడు.

సెప్టెంబర్ 21.. పాక్షిక సూర్యగ్రహణం.. చంద్రుడు సూర్యుడిలో కొంత భాగాన్ని కప్పి, కాంతివంతమైన “కొరికినట్టు” కనిపించే ప్రభావాన్ని సృష్టిస్తాడు..

సెప్టెంబర్ 22.. శరత్ విషువత్తు
పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి.. ఒక కొత్త సీజన్‌కు స్వాగతం పలికే సమయం..

సెప్టెంబర్ 27.. పగటిపూట ఉల్కాపాతం. పగటిపూట కూడా కనిపించే అరుదైన ఉల్కలు ఆకాశంలో మెరుస్తాయి.

ఈ అద్భుత క్షణాలను మీరు మిస్ అవ్వకండి.. ఈనెలలో ఆకాశంలో ఈ అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి.





