నేడు హుస్నాబాద్ లో మంత్రి పర్యటన
గాంధీ జయంతి, దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రేపు (అక్టోబర్ 2, గురువారం) హుస్నాబాద్ టౌన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు హుస్నాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో జమ్మి పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 9.30 గంటలకు గాంధీ విగ్రహం వద్ద గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని పుష్పాంజలి ఘటిస్తారు. తర్వాత 10.30 గంటలకు పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం 6.30 గంటలకు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో ఆహ్వానించింది.





