మినీ స్టేడియంలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం

మినీ స్టేడియంలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం

మినీ స్టేడియంలో సీఎం కప్ పోటీలను ప్రారంభించిన మంత్రి పొన్నం

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో సిఎం కప్ -2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అందులో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం హుస్నాబాద్ మున్సిపాలిటీ vs పోతారం కబడ్డీ మ్యాచ్ తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. సిఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపును నిలుపుకోవాలని.. ఓడిపోయినా వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు. చదువుతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడల్లో భాగస్వామ్యం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తుందని అందులో హుస్నాబాద్ నుండి పెద్ద  ఎత్తున విద్యార్థులు చేరడానికి పి ఈ టి లు కృషి చేయాలన్నారు. నేను సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూసిన అది చిన్న దేశమే అయినా ఒలంపిక్స్ లో 32 పథకాలు వచ్చాయి. భవిష్యత్ లో మన వాళ్ళు ఒలంపిక్స్ లో రాణించాలంటే ముందు స్టేట్, నేషనల్, ఎసియన్ గేమ్స్ ఆడి అక్కడ గెలవాలన్నారు. జాతీయ స్థాయిలో ఆడిన వారికి లక్ష రూపాయల బహుమానం అందిస్తా, పిల్లలందరికీ విద్యతో పాటు క్రీడలు కూడా జీవితంలో భాగస్వామ్యం గా ఉండలని తల్లిదండ్రులు , ఉపాధ్యాయులు  అందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు,ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంఈవో ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *