రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరిన మంత్రి పొన్నం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ ఎంపీలతో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం హుస్నాబాద్ లో పలు రోడ్లను డబుల్ రోడ్ల కు విస్తరణ & హైలెవల్ బ్రిడ్జి ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్లు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ ని కోరారు. కేంద్ర మంత్రిని నిధుల మంజూరు కోసం విజ్ఞప్తి చేసిన అంశాలు ఇవే: కోహెడ – దేవరక్కపల్లి రోడ్డు, Pwd రోడ్ నుండి నాగ సముద్రాల రోడ్డు, Pwd అక్కన్నపేట్ వయ రామవరం నుండి జనగామ వరకు, గుగ్గిళ్ళ నుండి తంగలపల్లి వరకు, తంగపల్లి వయ గుండారెడ్డి పల్లి నుండి బద్దిపడగా వరకు, గుంటూరు పల్లి నుండి కేశవపురం, కోతుల నడుమ మల్కనూరు వయ గోపాలాపూర్ వరకు, కోతుల నడుమ నుండి జగన్నాధపురం వయ జిలుగుల పెంచికర్ల, Pwd రోడ్డు వంగర హుజూరాబాద్ నుండి కన్నారం వరకు, బొమ్మనపల్లి డబుల్ లైన్ పొలంపల్లి, హుజూరాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్ల విస్తరణకు మరియు హుజురాబాద్ సుందరగిరి మధ్య హై లెవెల్ బ్రిడ్జి, మూలంగుర్ సైదాపూర్ మధ్య హై లెవెల్ బ్రిడ్జి, కొత్తగట్టు దుద్దెనపల్లి మధ్య, మానకొండూరు హుస్నాబాద్ మధ్య హై లెవెల్ బ్రిడ్జిలో నిర్మాణా నికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి ఫోన్ నెంబర్ ప్రభాకర్ కోరారు.