హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..

హుస్నాబాద్ లో సిద్దిపేట కలెక్టర్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..

హుస్నాబాద్ అభివృద్ధికి జరుగుతున్న పనులు తీసుకోవాల్సిన చర్యలపై ఫీల్డ్ విజిట్

ఉన్నత పాఠశాలలకు సైన్స్ , రోబోటెక్ కంప్యూటర్ ల్యాబ్..

మినీ  స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కార్యాచరణ

హుస్నాబాద్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేల ప్రణాళిక..

పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశాలు

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. హుస్నాబాద్ లో ఇప్పటికే నిర్మాణంలో పలు కార్యాలయాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాల ను సందర్శించారు. ఆ పాఠశాల లో కలెక్టర్ మను చౌదరి ప్రోద్బలంతో ఇన్ఫినిటీ విద్యా ఫౌండేషన్ ,  నిర్మన్.ఓఆర్జి  సంస్థలు సైన్స్ , రోబోటిక్ కంప్యూటర్ ల్యాబ్ లు ఒక్కో ల్యాబ్ 50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్నాయి. అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఉన్న సైన్స్ , కంప్యూటర్ ల్యాబ్ లను పరిశీలించారు. అధునాతన ల్యాబ్ లో వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే ఈ పాఠశాల వజ్రోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా  పాఠశాలకు ప్రత్యేక నిధులు మరింత అభివృద్ధి చేయాలని మంత్రి భావిస్తున్నారు. అక్కడే ఉన్న జూనియర్ కాలేజి కి వెళ్లి అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జూనియర్ కాలేజి లో ఉన్న విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల సంఖ్య ఎంత అక్కడ ఉన్న కోర్స్ లు, భవిష్యత్ లో విద్యార్థులకు ఉపయోగపడే ఒకేషనల్ కోర్సు లు అక్కడ ఏర్పాటు అయ్యేలా చూస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులలో వచ్చే వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. హుస్నాబాద్ లో ప్రభుత్వ స్కూల్ లు, కాలేజీలు, హాస్పిటల్ లో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా శానిటేషన్ నీట్ గా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. హుస్నాబాద్ లో శిల్పారామం తో రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించారు.

పశు వైద్యశాల మురికిగా ఉండడంతో దానిని శుబ్రపరచాలని సూచించారు. అన్ని కాలేజీలు , స్కూల్ లు, లైబ్రరీ, సెట్విన్ శిక్షణ కేంద్రానికి అందుబాటులో ఉండే ప్రదేశంలో మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సూచించారు. హుస్నాబాద్ లో ఉన్న మిని స్టేడియం ఉపయోగంలోకి తీసుకురావాలని జిల్లా క్రీడా అధికారులను ఆదేశించారు. మినీ స్టేడియం పక్కన ఉన్న మోడల్ స్కూల్, డిగ్రీ కాలేజి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి విద్యార్థులు అందులో ఆటలు అడుకునేల తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మినీ స్టేడియంలో పెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణం తో పాటు  పుట్ బాల్ కోర్టు ఏర్పాటు చేయాలని సెప్టెంబర్ 20 వ తేది లోపు దానిని ప్రారంభించుకునేల చర్యలు తీసుకోవాలన్నారు. అదే గ్రౌండ్ లో కబడ్డీ, కోకో, వాలీబాల్ కోర్టు లు ఏర్పాటు చేయాలని సూచించారు. హుస్నాబాద్ లో ఉన్న మెడల్స్ పొందిన క్రీడాకారులతో ఒక కమిటీ నీ ఏర్పాటు చేసి భవిష్యత్ లో నియోజకవర్గాన్ని క్రీడా హబ్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న స్మశాన వాటిక ను పరిశీలించారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఎప్పటి నుండి వినియోగంలోకి తీసుకొస్తున్నారని ఆరా తీశారు. హుస్నాబాద్ కి ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కాలేజి తీసుకొస్తామని చౌటుపల్లి లో మెడికల్ కాలేజి కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీ నుండి వచ్చే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల సైక్లింగ్ ప్లాంట్ ను పరిశీలించారు. దాని ద్వారా గ్యాస్ తో పాటు ఎరువులు కూడా లభిస్తాయని  దాని పనితీరును అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు నుండి వాటర్ లికవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.దానికి మరమత్తులు  చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దాంతో పాటు పశువుల అంగడి పక్కన ఉన్న స్థలంలో చేప పిల్లల పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు .


హుస్నాబాద్ లో నిర్మితమవుతున్న వెజ్ ,నాన్ వెజ్ భవన నిర్మాణాలకు పరిశీలించారు. భవన నిర్మాణల ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. అదే భవనం లో ఫ్లవర్స్, ఫ్రూట్ మార్కెట్ లు కూడా రానుండడంతో భవన విస్తీర్ణం, దాని అంచనా విలువ తదితర అంశాలపై వివరాలతో రావాలని అధికారులకు ఆదేశాలు. ఇప్పటికే రైతు బజార్ పుర్తైనందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నూతనంగా నిర్మించిన హుస్నాబాద్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించారు. అందులో ఉన్న షాపులు ఎన్ని కిరాయకు వెళ్ళాయి.ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం హుస్నాబాద్ చౌరస్తాలో కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తో కలిసి చాయ్ తాగుతూ ప్రజలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంత వరకు వరిస్తున్నాయి..ఎవరికైనా సమస్య ఉంటే అధికారులను కలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న , కౌన్సిలర్లు, ఆర్డీవో శ్రీరామూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ బొలిషెట్టి శివయ్య , లింగమూర్తి ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *