పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన వైష్ణవికి అభినందనలు తెలిపారు
చిగురు మామిడి మండలంలోని సమస్యల పరిష్కారానికి హామీ



సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిగురు మామిడి మండలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన దాసరి సిరి వైష్ణవ్య కి అభినందనలు తెలిపారు. మండల కేంద్రంలో వివిధ గ్రామాల కార్యకర్తలు, ప్రజలతో వారి గ్రామాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకొన్నారు. అలాగే చిగురుమామిడి మండలంలోని గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలకు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్ణకంటి మంజులారెడ్డి, ఆక్కు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.