సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ :
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.
హుస్నాబాద్ పట్టణంలోని 5 వ వార్డు హనుమాన్ నగర్ లో ప్రమాదవశాత్తు గొడపడి ఇళ్లు కూలడంతో బాధితురాలు చెవిటి పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన హమాలీ కూలీ ఉల్లెంగుల సంపత్ కుటుంబాన్ని పరామర్శించి, రాత్రి గుండెపోటుకు గురైన బత్తిని రామస్వామి గౌడ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు.
హుస్నాబాద్ పట్టణంలో హమాలీ సంఘం ను సందర్శించి, నూతన హమాలీ భవన నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన కొయ్యాడ రామయ్య కుటుంబాన్ని మరియు ఇటీవల మరణించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లకావత్ రామన్న నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు, భూక్య సరోజన, కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, చిత్తారి రవీందర్, మేకల వీరన్న యాదవ్, అక్కు శ్రీనివాస్, బంక చందు, గట్టు రాములు తదితరులు పాల్గొన్నారు.



