రోడ్డు ప్రమాద బాధితుల పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ఔదార్యం..
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ వద్ద రాజీవ్ రహదారి పై ఆటో ను వెనకనుండి బైక్ ఢీకొట్టింది. ఆటో లో వెనుక కూర్చున్న మహిళలతో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాదాన్ని గ్రహించి కాన్వాయ్ ఆపి క్షతగాత్రుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంటనే కాన్వాయ్ లో ఉన్న పోలీస్ వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
