భారీ వర్షాలకు హుస్నాబాద్ లో నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు నీటిలో మునిగిపోయిన పలు కాలని ల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి ఇళ్లలోకి, షాపులలోకి నీరు వచ్చిన ప్రాంతాలను పరిశీలించి భవిష్యత్ లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా భారీ వర్షాలు పడడం తో పలు కాలనీలలోకి వరద నీరు వచ్చి పలు మండలాలు, హుస్నాబాద్ పట్టణంలో చాలా మంది ఇళ్లలోకి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాళ్ల ఇళ్లలో ఉండే వంట సామాగ్రి, వస్తువులు, వ్యాపారస్తులు వృత్తిపరమైన సామాగ్రి మునిగిపోయి నష్టం జరిగింది. భవిష్యత్ లో ఎంత వర్షం వచ్చిన ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఒక సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వర్షం బ్రేక్ ఇస్తూ పడడం వల్ల పెద్దగా నష్టం జరగలేదు. నియోజకవర్గంలో కోహెడ మండలం రామచంద్రపురం లో ఆవుల కోసం వెళ్లి కెనాల్ లో పడి మృతి చెందిన కనక రెడ్డి కి సంతాపం తెలిపారు.
ఎవరు కూడా వ్యవసాయ రీత్యా, ఇంకా ఏదైనా నీళ్లలో కొట్టుకుపోతున్నాయని కానీ, చేపలు పట్టడం లాంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట – హుస్నాబాద్ వెళ్ళే దారిలో బస్వాపూర్ వద్ద, కోహెడ – ముల్కనూర్ వద్ద రోడ్ల పై భారీగా వరద వస్తుంది. రోడ్ల మీద నీళ్ళు పోతున్నపుడు వాహనదారులు ఎవరు ప్రయాణం చేయవద్దని, పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. హుస్నాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాం. అధికారులు స్థానికంగా క్షేత్ర స్థాయిలో ఉన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. ఎలాంటి పిర్యాదులు అయినా చేయవచ్చు అన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. హైదరాబాద్ మాదిరి జిల్లాలో పాఠశాలలు సెలవులు కూడా ప్రకటించాలని, పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఇప్పుడు జరిగిన నష్టం వచ్చే వర్షాకాలం లోపు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.








