కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

తెలంగాణ రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మాట్లాడుతూ.. ఇటీవల నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉభయ రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవాడానికి కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరుపున అన్ని ఏర్పాట్లు చేశామని, తిరుమలలో గతంలో తెలంగాణ భక్తులకు కొంత ఇబ్బందులు ఉండేవని, ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, కాబోయే చైర్మన్ ఆలయ ఈవో కు కోరుతూ..తెలంగాణ భక్తులు కూడా తెలుగు భక్తులే, గతంలో ప్రజాప్రతినిధుల సిఫాసులకు ఎలాంటి విధానాలు అవలంబించారో ప్రస్తుతం కూడా అలాగే చేయాలని, విదేశీ భక్తులను ఆహ్వానిస్తున్నప్పుడు పక్కన ఉన్న తెలంగాణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను కోరారు.
రెండు రాష్ట్రాల విభజన హామీలు అమలవడంతో పాటు మంచి వర్షాలు, ఆరోగ్యం, పాడి పంటలతొ, సుఖ సంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకున్నారు.
