తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:

సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్  లో రేపు జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు  పొన్నం ప్రభాకర్,జూపల్లి కృష్ణారావు,మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, ఇతర ముఖ్య నేతలు. అనంతరం మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ….

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ప్రజాస్వామికంగా ప్రజలు కోరుకున్న తెలంగాణ జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం..తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రతి పౌరుడు, కుల సంఘాల జేఏసి, తెలంగాణ సమాజం, ఆర్టీసి, సింగరేణి, జర్నలిస్ట్ లు, ఎన్జీవో లు, రిటైర్డు ఉద్యోగులు, కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తెలంగాణ ఆకాంక్షలను అందరూ గమనించాలి..ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణలో  సంవత్సరాలు మరోక నియంతృత్వ వేధికకు మారిన పరిస్థితి ఏర్పడింది..
మార్పు కోరుకుంటూ ప్రజలు ప్రజాస్వామిక తెలంగాణని  ప్రజల పాలన తెచ్చుకున్నటువంటి వేడుకలు..ప్రతి తెలంగాణ బిడ్డ ఉత్సాహంగా జరుపుకోవాలి .. అందరూ భాగస్వాములు కావాలి..

తెలంగాణ కి ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్నం..అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాం..రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏవిధంగా ఉండలో రేపటి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం.
రాజకీయంగా విమర్శలకు వేదిక కాదు..అన్ని పార్టీలు  వేడుకలు జరుపుకోవాలి, అందరూ భాగస్వాములు కావాలి..ఆనాటి తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనక్కి వేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోయేది..ప్రతి తెలంగాణ పౌరుడు, ఏ రాజకీయ పార్టీ అయినా సోనియా గాంధీ పాత్ర తెలంగాణ ఏర్పాటును ప్రతి ఒక్కరూ కొనియడాల్సిందే ..వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుడిది..పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు తెలంగాణ రాదని గళమెత్తి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాయి.

ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజన్ని అవహేళన పరిచే విధంగా తెలంగాణ అమరులని కించపరిచే విధంగా తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని అనే మాట ప్రతి తెలంగాణ బిడ్డగా స్పందించాలి .తెలంగాణ ఏర్పాటు లో సుష్మ స్వరాజ్ పాత్ర  మరిచిపోము. కానీ ప్రధాని స్వయంగా తెలంగాణా ఏర్పాటును అవమనపరిస్తే ఉద్యమకారులుగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. రాబోయే కాలంలో తెలంగాణ అన్ని రంగాలుగా మరింత ముందుకు పోవాలి..

గతంలో ఆత్మగౌరవం లేకుండా ఉండే..తెలంగాణ వేడుకలు రాష్ట్ర జన్మదినంగా అందరూ సంతోషంగా జరుపుకోవాలి..ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర అవిర్భావా వేడుకలు జరుపుకోవాలి..మాజీ ముఖ్యమంత్రి అయినా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పలికాము. అందరూ సంతోషంగా భాగస్వామ్యం కావాలి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ప్రదాత ఈ వేడుకలకు  రమ్మని కోరినం.. ఆమె తప్పకుండా వస్తారు.

ఎవరో చెబితే రాష్ట్ర చిహ్నాలు వాయిదా వేయలేం.. అందరం ఆహ్వానిస్తున్నాం అని, గతంలో పెట్టినప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకున్నారా.. ఎవరి సలహాలు అయినా తీసుకున్నారా అని ప్రశ్నించారు.

తెలంగాణ వాస్తావా పరిస్థితులు, భౌగోళిక చరిత్ర, అమరవీరులకు పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో మాట్లాడడానికి కూడా హక్కు లేకుండే, గతంలో మాట్లాడే హక్కు కూడా లేకుండే వారు నిరసన తెలుపుకోవచ్చు..ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుండి పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు..ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ బా ర స కలిసి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు.ఉమ్మడి రాజధాని పై అధికారికంగా జరగాల్సినవి జరుగుతాయి అని అన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *